ఫోన్ లో పోర్న్ చూస్తున్నారు.. ఫైన్ కట్టాలని పోలీస్ నోటీసులు.. ట్విస్ట్ ఏంటంటే..?

by Anukaran |   ( Updated:2021-07-27 02:54:08.0  )
ఫోన్ లో పోర్న్ చూస్తున్నారు.. ఫైన్ కట్టాలని పోలీస్ నోటీసులు.. ట్విస్ట్ ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నెట్ వచ్చాక ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో అమాయకులైన ప్రజలను ఆడుకుంటున్నారు. బోగస్ పేర్లతో డబ్బు గుంజుతున్నారు. తాజాగా పోలీసులు పేరుతో బోగస్‌ నోటీసులు పంపి పలువురు వ్యక్తుల వద్ద డబ్బులు గుంజుతున్న ముఠాను ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు చెన్నైలో అరెస్ట్‌ చేశారు. వివరాలలోకి వెళితే.. గ్రాబ్రియేల్‌ జేమ్స్‌, రామ్‌ కుమార్‌ సెల్వం, బి.ధీనుశాంత్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కొంచెం ఇంటర్నెట్ గురించి తెలియడంతో సైబర్ నేరాలకు పాల్పడతూ ఉండేవారు. ఇంకా ఎక్కువ డబ్బు కోసం ప్రజల భయాలను అడ్డుపెట్టుకున్నారు. ఫోన్ లో పోర్న్ చూసేవారి వివరాలు కనుక్కొని వారికి పోలీసుల పేరుతో బోగస్‌ నోటీసులు పంపేవారు.

మీరు మీ ఫోన్ లో పోర్న్ చూస్తున్నట్లు మాకు తెలిసింది.. అందుకే దానికి శిక్షగా ఫైన్ చెల్లించండి అంటూ చెప్పేవారు. దీంతో భయపడిపోయిన సదురు వ్యక్తులు ఎక్కడ పరువుపోతుందో అని వారు అడిగినంత డబ్బులు ఇచ్చేసేవారు. ఇలా మొత్తంగా పలువురు వ్యక్తుల వద్ద నుంచి నిందితులు రూ.30 లక్షలు కాజేశారు. ఇక ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు తమకు పోలీసులు ఇలా నోటీసులు పంపారు జాగ్రత్త అని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ సైబర్‌ క్రైం బ్రాంచ్‌ ఆ పోస్ట్ లను సుమోటోగా తీసుకుని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. బాధితులకు వచ్చిన బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులను టెక్నిలక్‌ టీం పరిశీలించి.. ఇవన్ని చెన్నై నుంచి వచ్చినట్లు తెలిపింది. దాంతో ఓ టీం చెన్నైలో వారం రోజుల పాటు మకాం వేసి.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.

ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాము కేవలం పాత్రధారులమేనని, తమకు ఈ పని చేయమని చెప్పింది బి చందర్‌కాంత్ అనే వ్యక్తి అని నిందితులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో, మోసం చేసిన డబ్బును తరలించడానికి 20 కి పైగా బ్యాంకు ఖాతాలు వారు ఉపయోగించినట్లు కనుగొన్నామని, వాటన్నింటిని సీజ్ చేస్తున్నామని తెలిపారు.

తొలిరాత్రే భార్యకు చుక్కలు చూపించిన భర్త.. టాబ్లెట్స్ వేసుకొని

For more viral News : https://www.facebook.com/TeluguViralnew

Advertisement

Next Story