- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ తయారీకి ఇలా చేయకతప్పదు!
దిశ, వెబ్‌డెస్క్: దోమలు చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ చాలా ప్రమాదకరమైనవి. స్వతహాగా అవేమీ ప్రమాదకరం కావు. కానీ వాటిని వారధిగా చేసుకుని మానవ శరీరంలో ప్రవేశించే వైరస్‌ల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్, మెదడువాపు వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ దోమల వల్ల రోగాలు వచ్చి చనిపోతున్నవారిని కాపాడలేకపోతున్నారు. భూమ్మీద షార్క్‌ల కంటే ఎక్కువగా దోమలు కరవడం వల్లనే జనాలు చనిపోతున్నారు. అయితే ఈ వ్యాధులన్నింటికీ మందు గానీ, వ్యాక్సిన్ గానీ కనిపెట్టాలంటే ముందు దోమల్లో ఆయా వైరస్‌లు ఎలా అభివృద్ధి చెందుతాయో, అవి మనిషికి ఎలా చేరతాయో తెలుసుకోవాలి. అందుకే శాస్త్రవేత్తలు దోమలతో కరిపించుకోవడానికి కూడా వెనకాడరు. అలాంటి శాస్త్రవేత్తల్లో పెర్రాన్ రాస్ ఒకరు.
ఇంట్లో రాత్రి కరెంటు పోయినపుడు ఒకటి రెండు దోమలు కుడితేనే చాలా చిరాకు పడుతూ.. ఆలౌట్‌లు, కాయిల్స్ వెలిగిస్తుంటాం. అలాంటిది పెర్రాన్ రాస్ తన పరిశోధనల్లో భాగంగా ఒకేసారి వేల కొద్దీ దోమలతో కరిపించుకుంటాడు. ఎంటమాలజిస్ట్ అయిన పెర్రాన్ గత ఐదేళ్లుగా డెంగ్యూ, జికా వైరస్‌లను దోమల నుంచి వ్యాపించకుండా ఎలా అరికట్టాలనే విషయం మీద పరిశోధన చేస్తున్నాడు. ఆ పరిశోధనలో భాగంగా దోమల మెకానిజాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం లేబొరేటరీలో దోమలు పెంచి, వాటికి వైరస్‌లు ఎక్కించి, వాటితో కుట్టించుకుని, మళ్లీ వైరస్‌ను నిర్వీర్యం చేసి, మళ్లీ దోమల్లో ఎక్కించి, మళ్లీ వాటితో కుట్టించుకుని.. ఇక తన పరిశోధనలో ఇదే రోజూ జరిగే విధానం. ఈ పరిశోధనలో భాగంగా వొల్బాచియా అనే బ్యాక్టీరియాను దోమ గుడ్డు దశలో ఉన్నపుడు ఎక్కిస్తే డెంగ్యూ వ్యాప్తిని కూడా అరికట్టవచ్చని ఇటీవల కనిపెట్టినట్లు రాస్ తెలిపారు.