అక్రమాలకు పాల్పడిన వారి భరతం పడతాం : దాసోజు శ్రవణ్

by Shyam |
అక్రమాలకు పాల్పడిన వారి భరతం పడతాం : దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జాకోరులుగా మారి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మింగేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలను రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపినా సీఎం కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని, మల్లారెడ్డితో కేసీఆర్ కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీల భరతం పడతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు, సీబీఐకి కూడా వెళతామని వెల్లడించారు.

అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. గుండ్లపోచంపల్లిలో 650 సర్వే నెంబర్ లో 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి పేరుపై ఎలా ఎక్కిందని, ఆ భూమిని మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరు పై రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. 1965-66 నుంచి 2020 వరకు పహాణిలో 22.8 ఎకరాలుగా ఉన్న భూమి, ధరణి వచ్చే సరికి 33.26 ఎకరాలు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. శామీర్‌పేట్ లో సీఎంఆర్ హాస్పిటల్ పేరుతో ప్రజల రక్తం తాగుతున్నాడని విమర్శించారు.

ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ ఎలా నిర్మిస్తారని, దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ కూడా సర్కార్ భూమి అని రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ని న్యాక్ బ్లాక్ లిస్ట్ లో పెడితే కేసీఆర్ ఏకంగా యూనివర్సిటీ కి అనుమతి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ కోసం 1200 మంది యువకులు చేసుకున్న బలిదానాలు మల్లారెడ్డి కోసమా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed