- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ పనులను పకడ్బందీగా చేయాలి’
దిశ, నిజామాబాద్ రూరల్: 4వ విడత పల్లెప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా గ్రామంలో ఆయన పల్లె ప్రగతి జిల్లా పంచాయతీ అధికారిని జయసుధతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కువగా స్వచ్ఛతకు ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామాలకు ఇచ్చిన హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేర మొక్కలు నాటాలని ఆయన అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా మెక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి మొక్కకు ఆధారంగా వెదురు బొంగులు ఉంచాలని గ్రామ కార్యదర్శులకు పంచాయతీ పాలకవర్గ సిబ్బందికి ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం పల్లె ప్రగతి పనులు చేపట్టిందని పనుల్లో అలసత్వం ఉండకూడదని అధికారులను హెచ్చరించారు. నాటిన ప్రతిమొక్క ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి వాటిని సంరక్షించే బాధ్యతపంచాయతీ పాలకవర్గ సిబ్బందికి కార్యదర్శుల పై ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత గ్రామాలకు చెందిన నర్సరీలలో ఉన్న మొక్కలు ప్రణాళికా బద్ధంగా నాటాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మొక్కకు రెండు గజాల దూరాన్ని ఉంచి నాటాలని ఉపాధి హామీ కూలీలకు అధికారులకు కలెక్టర్ వెల్లడించారు. అదేవిధంగా మొక్కలు నాటుతున్న కూలీలకు తాగునీటి వసతి స్థానికంగా టెంట్లు అందుబాటులో ఉంచాలని, ప్రతి గ్రామమూ పచ్చనదనంతో విరజిల్లాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశ్, కిమ్ పీవో మధురిమ తోపాటు అధికారులు పాల్గొన్నారు.