ముందు అలా చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి.. అచ్చెన్నాయుడు డిమాండ్

by srinivas |
Atchannaidu copy
X

దిశ, ఏపీ బ్యూరో: బూతులు మాట్లాడిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా? అని ప్రభుత్వాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గమని మండిపడ్డారు. వారు చేసిన తప్పేంటి ? వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే సాటి మహిళలుగా స్పందించటం తప్పా అని ప్రశ్నించారు. మహిళల‎ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా‎ మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ‎భద్రత ఎందుకు పెంచిందని దుయ్యబట్టారు.

మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దంన్నందుకు తెలుగు మహిళలను అరెస్టు చేస్తామని బెదిరించటం సిగ్గుమాలిన చర్యని వ్యాఖ్యానించారు. అరెస్టు చేయాల్సింది తెలుగు మహిళలను కాదు.. అసెంబ్లీ సాక్షిగా స్త్రీ జాతిని అవమానించిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహారశైలి, భాష ప్రజలు అసహ్యించుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్రంలోని మహిళలపై గౌరవం ఉంటే అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని పదవుల నుంచి తొలగించి క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed