ఈసారి ఆన్‌లైన్‌లో ‘ఇంజనీర్స్ డే’

by Shyam |
ఈసారి ఆన్‌లైన్‌లో ‘ఇంజనీర్స్ డే’
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈ ఏడాది తెలంగాణ ఇంజనీర్స్ డేను ఆన్‌లైన్ లో జరుపుకోవాలని నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా ఈ శనివారం ఉత్సవంగా జరగాల్సిన కార్యక్రమాన్ని వెబ్ ద్వారా జరపాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రభుత్వం, ఇంజనీర్ల సంఘాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. నవాబ్ అలీ జంగ్ బహదూర్ జన్మదినం అయిన జూలై 11వ తేదీన తెలంగాణ ఇంజనీర్స్ డే గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంజనీర్స్ డే ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు వి.ప్రకాష్, గౌరవ అతిధిగా సాగునీటి రంగ నిపుణులు, మాజీ ఎమ్మెల్యే సానా మారుతి పాల్గొననుండగా ముఖ్యమంత్రి ఓఎస్టీ శ్రీధర్ దేశ్ పాండే అధ్యక్షత వహించనున్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని పలు శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన 8మంది ఇంజనీర్‌లకు నవాబ్ అలీ జంగ్ బహదూర్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలు అందించనున్నారు.

Advertisement

Next Story