- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థుల ఫీజుకు రూ. 40 లక్షలు సేకరించిన ఉపాధ్యాయురాలు
దిశ, ఫీచర్స్: లాక్‌డౌన్ చాలామందికి ఆర్థిక కష్టనష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇల్లు గడవడమే గగనంగా మారిపోగా.. పిల్లల చదువుకు ‘ఫీజు’లు కట్టలేని పరిస్థితి. దీంతో అటు ఉపాధ్యాయులు కూడా ఉపాధిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించిన ఓ ఉపాధ్యాయురాలు.. వారి ఫీజులు చెల్లించేందుకు దాదాపు రూ. 40 లక్షలు సమకూర్చింది. ఆ గురువు ఎవరు?
అజ్ఞానపు చీకట్లను పారద్రోలి, విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానపు వెలుగుల్ని ప్రసరింపజేసే వ్యక్తిగా గురువుకు ప్రత్యేక స్థానముంది. అయితే కేవలం జ్ఞానబోధనకే పరిమితం కాకుండా, వారి జీవితాల్లోని ఆర్థిక కష్టాలను కూడా పరిష్కరించి విద్యార్థులకు అండగా నిలిచిన ముంబై ఉపాధ్యాయురాలు షిర్లే పిళ్లై.. ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. లాక్‌డౌన్ కాలంలోనూ విద్యార్థులకు సరైన విద్యను అందించేందుకు తన వంతు కృషి చేసిన పిళ్లై.. పలు విషయాలను వెల్లడించింది. తన 35 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నడూ చూడని విధంగా చాలామంది పేరెంట్స్ ఫీజు చెల్లించేందుకు ఇబ్బందిపడ్డారని, ఆ కారణంగానే ప్రోగ్రెస్ కార్డులు తీసుకెళ్లడానికి విద్యార్థులు, పేరెంట్స్ ఎవరూ రాలేదని తెలిపింది. 2,200 మంది విద్యార్థుల్లో 50 శాతం కూడా ఫీజులు వసూలు కాలేదు. ఈ క్రమంలో పిళ్లై 25% డిస్కౌంట్ ఇప్పించినప్పటికీ బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఫీజు చెల్లించలేకపోవడంతో ఉపాధ్యాయులు సంబంధిత విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆరా తీస్తే అసలు సమస్య వెలుగుచూసింది. రోజువారీ కూలీలు, దిగువ మధ్యతరగతికి చెందిన పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగ నష్టాలు, వేతనాల్లో కోతలు ఎదుర్కొంటుండగా, కొందరు పనే లేకుండా కాలం వెల్లదీస్తున్నారని, పూట గడవడమే కష్టంగా ఉన్నట్లు టీచర్స్‌కు తెలిసింది.
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఫీజు చెల్లించేందుకు క్రౌడ్ ఫండింగ్ విధానమే సరైందని ప్రిన్సిపాల్ షిర్లే పిళ్లై నిర్ణయించుకుంది. ఈ మేరకు స్థానిక కమ్యూనిటీ నెట్‌వర్క్స్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కార్పొరేట్‌లను సంప్రదించడం ప్రారంభించింది. పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలతో పాటు ఇతర వ్యక్తుల నుంచి రూ .40 లక్షల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చి విద్యార్థుల ఫీజులు చెల్లించింది. కాగా అక్కడి విద్యార్ధులు ఇలాంటి విద్యావేత్తను కలిగి ఉండటం నిజంగా ఆశీర్వాదమే అని స్థానికుల భావిస్తున్నారు.
‘ఈ ప్రయత్నం ఫలించటం నాకు సంతోషంగా ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు, స్పాన్సర్స్ ప్రతిస్పందించడానికి కొంత సమయం పట్టింది. సేకరించిన నిధులతో సుమారు 200 మంది విద్యార్థుల ఫీజులు చెల్లించాం. ప్యూన్, బస్ డ్రైవర్ పిల్లల చదువుకు కూడా ఈ డబ్బు ఉపయోగపడింది. ఇప్పుడు విద్యార్థుల కోసం 2021-22 విద్యా సంవత్సరానికి స్పాన్సర్‌లను చూస్తున్నాం. ఫీజుల గురించి ఒత్తిడి లేకుండా ఉండాలని, వాళ్లంతా చదువులపై మాత్రమే దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలంతా ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావాలి’ అని ముగించింది.