ఉర్రూతలూగిస్తున్న లెగో వెర్షన్‌ బీటీఎస్.. ‘మై యూనివర్స్’

by Shyam |   ( Updated:2021-10-27 03:35:36.0  )
Beeteesh142
X

దిశ, ఫీచర్స్: కొరియన్ క్రేజీ సింగర్స్ బ్యాండ్ ‘బీటీఎస్’ నుంచి వెలువడే పాటలు ఇప్పటికే వరల్డ్ ఫేమస్. ఈ ఏడాది ‘మే’ నెలలో రిలీజైన ‘బటర్’ సాంగ్ గత రికార్డ్‌లన్నింటినీ బద్దలు కొట్టడంతోపాటు ‘యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 చార్ట్’లో అత్యధిక కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ‘మై యూనివర్స్’ పేరుతో తాజాగా మరో సింగిల్ విడుదల చేయగా, అది కూడా నెంబర్ వన్ చాట్ బస్టర్‌గా నిలిచింది. బీటీఎస్, బ్రిటీష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ కలిసి అందించిన ఈ పాట కూడా ‘హాట్ 100’లో చోటు సంపాదించుకుంది. దీంతో ఈ హిట్ సింగిల్ బజ్ కొనసాగుతుండగా.. ఈ మ్యూజిక్ వీడియో‌పై వచ్చిన లెగో వెర్షన్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో విడుదలైన ‘మై యూనివర్స్’ మ్యూజిక్ వీడియో.. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇక ఈ పాటకు అభిమానిగా మారిన క్లెమెంట్ బొకెట్ ఆ మ్యూజిక్‌ను ‘లెగో’లతో రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఈ మేరకు బ్రిటీష్ బ్యాండ్‌లోని నలుగురు బ్యాండ్ సభ్యులతో కలిసి కొరియన్ సెప్టెట్(గ్రూప్ ఆఫ్ 7 పీపుల్) లెగో వెర్షన్‌ను సృష్టించిన బొకెట్.. ఇతర పాత్రలను కూడా డిజైన్ చేసి ఔరా అనిపించాడు. ఈ అద్భుతమైన వీడియో రెండు బ్యాండ్‌ల అభిమానులను మాత్రమే కాకుండా కళాకారులను కూడా ఆకట్టుకుంది. ఇక ట్విట్టర్‌లో ఈ వీడియోపై స్పందించిన కోల్డ్‌ప్లే.. తమ అధికారిక హ్యాండిల్‌లో ‘దిస్ బ్లోస్ మై మైండ్’ అంటూ కీర్తించింది. కాగా ‘ఇది నమ్మశక్యం కాని రీతిలో ఉంది. చాలా కూల్‌గా ప్రతీది వివరంగా, పరిపూర్ణంగా ఉంది! వావ్, ఇట్స్ రియల్లీ గ్రేట్. మీకు నా అభినందనలు’ అంటూ ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story