- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదే అత్యంత దారుణమైన రోజు -రోహిత్ శర్మ
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 13లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబయిపై హైదరాబాద్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ల ధాటికి ముంబై బౌలర్లు తోకమూడిచారు. ముంబయి జట్టు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ తిరిగి ముంబయి జట్టు కోసం ఓపెనింగ్ చేశాడు. అయితే హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ ఆదిలోనే ముంబయి జట్టును ఎదురుదెబ్బ తీశాడు.
మూడో ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతిని ఆడిన రోహిత్ శర్మ.. నేరుగా డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మ్యాచ్ అనంతరం ముంబయి ఇండియన్స్కెప్టెన్రోహిత్ శర్మ మాట్లాడుతూ… సీజన్‌లో మాకు ఇదే అత్యంత దారుణమైన రోజు అన్నారు. దీన్ని మేము గుర్తుంచుకోవాలని అనుకోవడం లేదు. నేను మళ్లీ క్రికెట్ ఆడటం మంచిగా ఉంది. నా గాయం అంత పెద్దగా బాధించడం లేదు. ఇకపై మేము మరింత అప్రమత్తంగా ఉండాలి అన్నారు.