- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలంక పర్యటనలో వారు చెప్పిన వారినే తీసుకుంటాం
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనలో ఎవరెవరిని ఆడించాలనే విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. జట్టు కూర్పు పూర్తిగా సిద్దమైందని శిఖర్ ధావన్ చెప్పాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఈ ఒక్క పర్యటన మాత్రమే ఉంది కాబట్టి జట్టు కూర్పు జాగ్రత్తగా చేశామని కెప్టెన్ ధావన్ అన్నాడు. పర్యటనలో మొత్తం 6 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వీటిలో ఎవరెవరు ఎన్ని మ్యాచ్‌లు ఆడుతారో ఇప్పటికైతే తెలియదు. కానీ అందుబాటులో ఉన్న వారిలో మెరుగైన 11 మంది బరిలోకి దిగుతామని ధావన్ చెప్పాడు. ఇప్పటి వరకైతే తాను రవిశాస్త్రి, విరాట్ కోహ్లీలతో నేను మాట్లాడలేదు. అయితే సెలెక్టర్లు, కోచ్ ద్రవిడ్ మాట్లాడుకునే ఉండొచ్చని ధవన్ అన్నాడు. రవిశాస్త్రి, విరాట్ ఎవరైనా ఆటగాడిని పరిశీలించమని కోరితేనే తీసుకుంటామని.. అప్పటి వరకు మా వ్యూహం ప్రకారమే వెళ్తామని ధావన్ చెప్పుకొచ్చాడు. అందరినీ కచ్చితంగా ఆడించాలనే నిబంధన ఏదీ మాకు లేదు. కాబట్టి స్వేచ్ఛగా జట్టు కూర్పు జరుగుతుందని ధావన్ చెప్పుకొచ్చాడు.