- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ న్యూ స్ట్రెయిన్‌కు.. నియాండెర్తల్‌తో చెక్
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది డిసెంబర్ నాటికే చైనాలో విజృభించిన కరోనా వైరస్, ఆ తర్వాత ప్రపంచాన్ని అతలాకుతలం చేయగా, ఈ డిసెంబర్‌లో యూకే కరోనా వైరస్ వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచదేశాలన్నీ అప్రమత్తమైనా, ఇప్పటికే యూకే కొత్త వేరియంట్ తీవ్రత పెరిగింది. అధిక వైరల్ లోడ్‌తో పాటు అత్యంత వేగంగా వ్యాపించగల ఈ కరోనా వేరియంట్ బ్రిటన్‌లో ఇప్పటికే తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అయితే ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి నుంచి నియాండెర్తల్ జన్యువు (Neanderthal gene) రక్షించగలదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్, బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
నియాండెర్తల్ జన్యువులోని ఓఏఎస్1 (OAS1) అనే ప్రోటీన్ న్యూ కరోనా స్ట్రెయిన్ తీవ్రతను అడ్డుకోగలదని, ఓఏఎస్1 ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నవారిలో కరోనా ముప్పు తీవ్రత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎవరిలోనైతే నియాండెర్తల్ జీన్ ఉంటుందో, వారు కరోనా వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చునని రీసెర్చర్లు పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి యాంటీబాడీల ఉత్పత్తి కీలకంగా మారగా, ఈ ప్రోటీన్ ఉన్న కరోనా బాధితుల్లో యాంటీబాడీల ఉత్పత్తి వేగంగా ఉంటుందని, ఫలితంగా వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలదని చెబుతున్నారు. దీనికి సంబంధించి రీసెర్చర్లు 200 మందికి పైగా కరోనా బాధితులపై అధ్యయనం చేశారు. వారిలో 179 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిందరిలో యాంటీబాడీలు కేవలం 14 రోజుల్లోనే ఉత్పత్తయ్యి కోలుకున్నారు. 14 రోజులు దాటినా యాంటీబాడీలు డెవలప్ కాని బాధితుల్లో మాత్రం వైరల్ లోడ్ పెరిగిపోయి, వైరస్ తీవ్రత పెరిగినట్టు గుర్తించారు. కాగా ఓఏఎస్1 అనే ప్రోటీన్.. సహారన్ ఆఫ్రికన్లలో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న కరోనా వైరస్ వ్యాప్తి 30 శాతం ఉంటే, ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి 40-70 శాతం ఉన్నట్టుగా తెలుస్తోంది.