నోరు పరిశుభ్రంగా లేకపోతే.. కొవిడ్ ముప్పు అధికం

by Shyam |
నోరు పరిశుభ్రంగా లేకపోతే.. కొవిడ్ ముప్పు అధికం
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా రికవరీ రేటు బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ఈ మహమ్మారి కారణంగా చనిపోతున్నారు. అయితే, కరోనాతో చనిపోయే వారిలో అంతకుమునుపే ఏదో ఒక తీవ్ర అనారోగ్య సమస్య ఉండటం వల్లనే వాళ్లు రికవరీ కాలేక చనిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ డిసీజెస్, ఒబెసిటీ, ఆస్తమా, డయాబెటిస్.. ఇలా కొన్ని జబ్బులు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కరోనాతో చనిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

హార్ట్ ఎటాక్స్, డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్స్ వంటి అనారోగ్య సమస్యలు రావడానికి మన నోటికి, శరీరానికి తప్పకుండా ఓ సంబంధం ఉంటుందని న్యూ మెక్సికోకు చెందిన ఓరల్ డెంటిస్ట్ సర్జన్ షెర్విన్ చెబుతున్నారు. అయితే బ్యాడ్ హాబిట్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సమస్య.. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం. ఒక డర్టీ టీత్ మీద 100 మిలియన్ బ్యాక్టీరియా జీవించగలదని, ఆ బ్యాక్టీరియా కేవల ఒకే నిమిషంలో శరీరమంతా వ్యాపించి రక్తప్రవాహంలో కలిసిపోతుందని షెర్విన్ అంటున్నారు.

రక్తప్రవాహంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే.. మన శరీరం ఆ బ్యాక్టీరియా నుంచి రక్షించుకోవడానికి ‘ఇంటర్‌లూకిన్ -6(IL-6)’ అనే ప్రోటీన్‌ను విడుదల చేస్తుంది. అయితే అది మోతాదుకు మించి విడుదలైతే శరీరంలో కాంప్లికేషన్స్ మొదలవుతాయి. అంతేకాదు, ఐఎల్ -6.. టిష్యూస్‌ను కూడా నాశనం చేస్తుందని, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తగ్గడానికి అది కారణమవుతుందని డాక్టర్ షెర్విన్ చెప్పారు. పరిశుభ్రత లేని నోరు వల్ల కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన అధ్యయనంలో తేలింది. ఐఎల్-6 సాధారణంగా 0.0 నుంచి 15.5 పికోగ్రామ్ / మిల్లీలీటర్ (pg/ml) ఉండాలి. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కొవిడ్ కారణంగా చనిపోయిన బాధితుల్లో సగటు ఐఎల్-6 స్థాయి 65 pg/ml ఉంది. అందుకే నోటి పరిశుభ్రత లేకపోవడం కూడా కరోనా తీవ్రతను పెంచుతుందని షెర్విన్ చెబుతున్నారు. ఐఎల్ స్థాయి పెరిగిన కారణంగా కొవిడ్ వల్ల చనిపోయే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. కరోనా ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చిగుళ్ళు, దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలని, రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం, మౌత్ వాష్ వంటివి చేసుకోవాలని సూచించాడు.

Advertisement

Next Story