41,500 ఏళ్ల నాటి ఏనుగు దంతపు లాకెట్!

by Shyam |
41,500 ఏళ్ల నాటి ఏనుగు దంతపు లాకెట్!
X

దిశ, ఫీచర్స్: ఇష్టమైన వారి ప్రేమకు ప్రతిరూపంగా ‘లాకెట్స్’ నిలుస్తుంటాయి. మనిషి పుట్టుక నుంచి చూసుకుంటే.. ఇప్పటివరకు ఎన్నో రకాల పెండెంట్స్ మన మనసు దోచుకున్నాయి. అయితే పోలాండ్‌లోని స్టాజ్నియా గుహలో దొరికిన ఓ ఆభరణం అందర్నీ ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో ఈ లాకెట్ లభించగా, ఇది యురేషియాకు చెందినదిగా భావిస్తున్నారు. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ పెండెంట్ 41,500 సంవత్సరాల నాటిదని తేలింది.2006 నుంచి స్టాజ్నియా గుహను అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన తవ్వకాల్లో నియాండర్తల్ అవశేషాలతో పాటు, జంతువుల ఎముకలు, ఇతర కళాఖండాలు – కనుగొన్నారు.

ఈ క్రమంలోనే ఐవరీ లాకెట్‌కు చెందిన రెండు శకలాలు, మరొక భాగాన్ని(awl ) కనుగొన్నారు. లాకెట్టు గుండ్రని అంచులతో ఓవల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. లాకెట్‌లోని అతిపెద్ద భాగం 4.5 సెం.మీ పొడవు, 1.5 సెం.మీ వెడల్పు ఉండగ, awl పొడవు 68.33 మి.మీ. ఉంది. రేడియోకార్బన్ డేటింగ్ టెక్నిక్‌ని ఉపయోగించి ఈ లాకెట్ 41,500 సంవత్సరాల క్రితంగా గుర్తించారు. లాకెట్ మమూత్ దంతంతో, గుర్రపు ఎముక నుంచి తయారు చేసినట్లు మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణలో తేలింది.

పరిశోధకుల బృందం మైక్రో-టోమోగ్రాఫిక్ స్కాన్ ఉపయోగించి 3Dలో లాకెట్‌ను పునరుద్ధరించారు. హోమో సేపియన్స్ సృజనాత్మకతతో పాటు, వారి అసాధారణ మాన్యువల్ నైపుణ్యాలను ఈ ఆభరణం చూపుతుంది’ అని వ్రోక్లా విశ్వవిద్యాలయానికి చెందిన సహ రచయిత వియో లెట్టా అన్నారు.

Advertisement

Next Story