- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న తిరుమల
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 25వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశికి తిరుమల దేవస్థానం ముస్తాబవుతోంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. అయితే 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శనాలు కల్పించనున్నట్లు టీడీడీ వెల్లడించింది. కలియుగ దేవుడైన తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాగా, కోవిడ్ నిబంధనలు అనుగుణంగా అలిపిరి, గదులు కేటాయింపు, వైకుంఠం క్యా కాంప్లెక్స్, స్వామివారి ఆలయం వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సదుపాయం కల్పించారు. 10 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నదానం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story