- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాట్నా : బీహార్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో మూడోవంతు ఒక్క కుటుంబంలోనే వెలుగుచూశాయి. పాట్నా నుంచి 130 కిలోమీటర్ల దూరంలోని సివన్ జిల్లాల్లోని ఒక కుటుంబంలోనే సుమారు ఇరవై మందికి సోకింది. రాష్ట్రంలో 60 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సివన్ జిల్లాలోని పంజవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒమన్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. మార్చి 16న స్వగ్రామానికి వచ్చిన సదరు వ్యక్తికి ఏప్రిల్ 4న కరోనా పాటిజివ్‌గా తేలింది. ఈ మధ్య కాలంలో అతను పలుచోట్ల పర్యటించాడు. లక్షణాలు వెంటనే బయటికి కనిపించకపోవడంతో అందరితో కలిసిమెలిసి తిరిగాడు. ఫలితంగా ఆ వ్యక్తి కుటుంబంలోనే ఇరవై మందికి కరోనా సోకింది. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరికి వైరస్ పాజిటివ్ తేలింది. కుటుంబంలోని నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ జిల్లాలోనే 31 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని సగం కేసులు ఒక్క జిల్లాలోనే రిపోర్ట్ అయ్యాయి.
ఈ వ్యక్తిని గుర్తించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్. విదేశాల నుంచి తిరిగివచ్చినవారికి నిర్వహించిన టెస్టుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామం సహా జిల్లాలోని నలభై మూడు గ్రామాలను సీల్ చేసినట్టు తెలిపారు.
Tags: coronavirus, bihar, third cases, single family, oman, foreign