- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాక్సిన్ తీసుకునే ముందు ఆలోచించండి.. ఎందుకంటే…?

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆలోచించాలని అంటున్నారు సీనియర్ జర్నలిస్టు, హోమియోపతి వైద్యులు అంబటి సురేందర్ రాజు. గత 38 సంవత్సరాలు పత్రికా రంగంలో అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం హోమియోపతి వైద్యులుగా ప్రాక్టీసు చేస్తున్నారు. అయితే కొ.ప్ర అనే పేరుతో కవితలు, రచనలు చేసే కొళ్లపూడి ప్రసాద్ అనే సీనియర్ జర్నలిస్టు ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజునుండే బ్రేన్ హేమరేజ్ వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
దీనిపై స్పందించిన అంబటి సురేందర్ రాజు కరోనా వ్యాక్సిన్‌లో లోపాలు ఉన్నాయని, ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న చాలా మంది మరణించారన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకంటే ఎక్కువ మందే మరణించారని, కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టి, శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా గురించి భయపడాల్సిన పని లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు. అయితే ప్రభుత్వాలో.. ఇంకెవరో వ్యాక్సిన్ తీసుకోమని చెబితే కాకుండా.. వ్యాక్సిన్‌పై పూర్తి అవగాహన వచ్చాకే టీకా తీసుకోవాలన్నారు.