హోల్ సేల్ దుకాణంలో రూ. 3 లక్షల సిగరేట్లు చోరీ

by Sumithra |
హోల్ సేల్ దుకాణంలో రూ. 3 లక్షల సిగరేట్లు చోరీ
X

దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో దొంగలు రెచ్చిపోయారు. రాళ్లగూడ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి హోల్ సేల్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి.. లోనికి చొరబడ్డ నలుగురు వ్యక్తులు రూ. 3 లక్షల మేర సిగరేట్లను దోచుకెళ్లారు. ఉదయం 8 గంటలకు పక్క షాపు యాజమాని దొంగతనం జరిగిందని గుర్తించి.. బాధిత షాపు ఓనర్‌కు చెప్పడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. సీసీ ఫుటేజీని పరిశీలించి మొత్తం నలుగురు దుండగులు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగానే విచారణ ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed