వారందరికీ కరోనా టెస్టు.. ఆ తర్వాతే ఓటింగ్.. కాంగ్రెస్ అధ్యక్షుడు

by Shyam |   ( Updated:2021-12-03 06:24:07.0  )
congress
X

దిశ, సిద్దిపేట: మెదక్ పార్లమెంటరీ పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా విహారయాత్రకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులంరందరికీ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, ఆ తర్వాతే వారు ఎమ్మెల్సీ ఓటింగ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి ఓటు వేస్తారని గమనించిన సీఎం కేసీఆర్ మెదక్ పార్లమెంటరీ పరిధిలోని ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో సహా విహారయాత్రకు పంపడం దారుణమన్నారు. ఓ వైపు కరోనా ఉన్న నేపథ్యంలో మరో వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దూసుకువస్తున్న తరుణంలో ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాలకు పంపడం వారి ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు.

ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, ఒకరికి భయపడి తమ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. వరుస ఓటములు చవిచూస్తున్న టిఆర్ఎస్‌ మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా కోల్పోతామేమోనన్న భయంతోనే ప్రజా ప్రతినిధులను విహారయాత్రకు తరలించిందన్నారు. ఇన్ని రోజులు ప్రజాప్రతినిధులను పట్టించుకోని టీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకబోస్తూ విహారయాత్రకు పంపి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అవసరం కోసమే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, వారి మాటలు నమ్మకుండా నిర్మల జగ్గారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజాసేవ కోసమే అంకితమైన కుటుంబం జగ్గారెడ్డిదని, ఆయన భార్య నిర్మల జగ్గారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అతీక్. గ్యాదరి మధు.మాజర్ మాలిక్.రాషాద్. గాయసుద్దీన్. నదీమ్.సిరాజ్. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed