- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురువుగా భావిస్తే.. పొట్టనపెట్టుకున్నారు : సాగర్ తండ్రి
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియంలో గత మంగళవారం జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ ధంకర్ మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణకు మూల కారణం స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా, తన కుమారుడు గత ఎనిమిదేళ్లుగా చత్రాసాల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడని.. సుశీల్ కుమార్‌ను గురువుగా భావించే వాడని తండ్రి అశోక్ అన్నారు. అతడిని ఎందుకు హత్య చేశారో అర్దం కావడం లేదు.. గురువుగా భావిస్తే పొట్టన పెట్టుకున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ ఏదైనా తప్పు చేసుంటే చత్రాసాల్ స్టేడియం నుంచి బయటకు వెళ్లగొట్టాల్సింది. కానీ ఇలా ప్రాణాలు తీయడం ఏమిటని కుటుంబ సభ్యుడు నరేంద్ర ధంకర్ అన్నాడు. ‘సాగర్‌కు రెజ్లింగ్ మీద మక్కువ ఉండటంతో చత్రాసాల్ స్టేడియంలో గత 8 ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. నా కుమారుడిని మహిపాల్ సత్పాల్ చేతుల్లో పెట్టాను. ఒక మంచి రెజ్లర్‌గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు గెలిచాడు. చత్రాసాల్‌లో ఒక్కరోజు కూడా శిక్షణను మిస్అయ్యే వాడు కాదు. గురువులకు మాట రానిచ్చే వాడు కాదు. సాగర్ ఏదైనా తప్పు చేసుంటే బయటకు పంపించాల్సింది. కనీసం తనను పిలిచి మాట్లాడినా బాగుండేది. కానీ ఎందుకు ఇంత పని చేశారు. సాగర్ ప్రాణాలు తీయడం ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు’ అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.