వరల్డ్ ఫేమస్ యాప్స్.. అక్కడ నిషేధం

by  |
వరల్డ్ ఫేమస్ యాప్స్.. అక్కడ నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్‌: దేశ భద్రతకు ముప్పు ఉందంటూ టిక్‌టాక్, హలో, వి చాట్, యూసీ బ్రౌజర్, షేర్‌ఇట్, క్యామ్ స్కానర్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే మీకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లను ఫిదా చేసిన కొన్ని యాప్స్‌పై చైనాలో ఎప్పటినుంచో నిషేధం ఉంది. ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ , అమెజాన్‌ ఆ జాబితాలో ఉన్నాయి.

ఫేస్‌బుక్:

వరల్డ్స్ మోస్ట్ పాపులర్ యాప్స్‌లలో ‘ఫేస్‌బుక్’ టాప్ 5లో తప్పక ఉంటుంది. 2.60 బిలియన్ మంది మంత్లీ యూజర్లు ఎఫ్‌బీకు ఉన్నారు. కానీ, చైనాలో మాత్రం ఫేస్‌బుక్ అందుబాటులో ఉండదు. చైనీయులు ఎఫ్‌బీ బదులు ‘విచాట్’ ఉపయోగిస్తారు.

ఇన్‌స్టాగ్రామ్ :

ఇన్‌స్టా పేరేంట్ యాప్ ఫేస్‌బుక్ లాగానే .. ఈ యాప్‌ను కూడా చైనాలో నిషేధం విధించారు. దీనికి ఆల్టర్నేట్‌గా చైనీయులు విచాట్ యూజ్ చేస్తారు. దీనికి అక్కడ దాదాపు 1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

వాట్సాప్:

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ కూడా చైనా ప్రజలు వాడరు. అక్కడ ‘క్యూక్యూ’అనే మెసేజింగ్ యాప్‌ను ఎక్కువగా వాడతారు.

గూగుల్:

గూగుల్ ఎప్పటినుంచో డ్రాగన్ కంట్రీలో పాగా వేయాలని ట్రై చేస్తోంది. కానీ, ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. సమీప భవిష్యత్తులో కూడా ఆ అవకాశం వచ్చే పరిస్థితులైతే లేవు. ఇక గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా చైనీయులు ‘బైదు’ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తారు.

అమెజాన్:

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ‘అమెజాన్’ తప్పక ఉంటుంది. బంపర్ ఆఫర్లతో పాటు, తన ఫాస్ట్, ఈజీ డెలివరీతో యావత్ ప్రపంచ నెటిజన్లను ఫిదా చేసిన ఈ యాప్… చైనాలో నెట్టంతా జల్లెడ పట్టినా కనిపించదు. ‘తావోబావో’ ‘టీమాల్’‌లు చైనాలో చాలా ఫేమస్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌గా పేరొందాయి.

యూట్యూబ్:

కడుపుబ్బ నవ్వించే జోకులు, కంటతడి పెట్టించే పాటలు.. వేడి రాజేసే వార్తలు, చల్లని కబుర్లందించే వాతావరణ విశేషాలు.. ఏవైనా యూట్యూబ్ వీడియోల్లో చూడాల్సిందే. టాపిక్ ఏదైనా.. యూట్యూబ్‌లో వెతికి.. ఆ వీడియో లెక్క తేల్చాల్సిందే. చైనాలో మాత్రం… యూట్యూబ్ ఊసే వినిపించదు. అక్కడ దీనికి బదులుగా ‘యూకూ’, ‘టుడౌ’లలో వీడియోలు చూస్తారు.

ట్విట్టర్:

పొట్టి కూతలకు కేరాఫ్ అడ్రస్ ‘ట్విట్టర్’. దేశాల మధ్య యుద్ధాలకు కూడా ఈ చిట్టిపొట్టి సందేశాలు అగ్గి రాజేసేయంటే.. ఈ యాప్ ఎంతగా జనాదారణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పిట్ట కూతలు కూడా చైనాలో వినిపించవు. అక్కడ షార్ట్ మెసేజ్‌లకు ‘వైబో’(weibo) వాడతారు.

క్వోరా:

అభిమన్యుడు ఎందుకు వెనక్కు రాలేకపోయాడు?
చైనా యాప్‌ల నిషేధం వల్ల ఏమిటి ఉపయోగం?
కేసీఆర్ కరోనాను లైట్‌గా తీసుకుంటున్నాడా?
ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలకు… సమాధానాలు చెప్పే .. యాప్ ‘క్వోరా’. అయితే చైనాలో ‘క్వోరా’ కనిపించదు. దాని ప్లేస్‌ను ‘జిహిహు’ అనే యాప్ ఆక్రమించేసింది.

గూగుల్ మ్యాప్స్ :

మనకు దిక్సూచిగా మారిన ‘గూగుల్ మ్యాప్స్’కు చైనాలో చోటు లేదు. బైదు మ్యాప్స్ .. దీనికి ఆల్టర్నేట్‌గా చైనీయులు వాడతారు.

టిండర్ :

డేటింగ్ చేయాలంటే… ‘టిండర్’ మనకు బెస్ట్ ఆప్షన్. కానీ, చైనాలో అయితే.. ‘మోమో’ ‘టాన్‌టాన్’‌లు టిండర్‌కు ప్రత్యామ్రాయంగా ఉన్నాయి.



Next Story