టీకా రావచ్చు.. రాకపోవచ్చు

by  |
టీకా రావచ్చు.. రాకపోవచ్చు
X

జెనీవా: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముమ్మరంగా ప్రయోగాలు సాగుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచదేశాలకు హెచ్చరికలు చేసింది. కరోనాకు టీకా రావొచ్చు.. రాకపోవచ్చు అని పేర్కొంటూ ప్రస్తుతం కనుగొన్న కట్టడి చర్యలను పటిష్టంగా అమలు చేసి వైరస్‌కు చెక్ పెట్టాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియసస్ సూచించారు. టెస్టింగ్, కాంట్రాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్ ధరించడం లాంటి ముందుజాగ్రత్తలు కఠినంగా పాటించాలని తెలిపారు. కరోనా నుంచి ప్రజలను రక్షించే టీకాలు రావాలని ఆశిస్తున్నామని, కానీ, అవి కచ్చితంగా అందుబాటులోకి వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదని పేర్కొన్నారు.


Next Story

Most Viewed