- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కోఆప్షన్’.. ఎవరికి ఆప్షన్!
దిశ, మేడ్చల్ : మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. అయినా మున్సిపాలిటీల్లో పదవుల పందేరం ఆగట్లేదు. అదేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంది. ఈ 4 పోస్టుల్లో రెండు మైనార్టీలకు, మరో రెండు ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి కేటాయించాల్సి ఉంటుంది. త్వరలో కోఆప్షన్ సభ్యుల నియామాకానికి నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నేతల్లో కొత్త ఉత్సహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు కలిసి రాక, స్థానికంగా పోటీ ఎక్కువ ఉండటం, ఇతర కారణాలతో పోటీ చేయలేకపోయిన నేతలంతా ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల నియమాకంపై దృష్టి సారించారు. వాటిని దక్కించుకునేందుకు ఎవరిస్థాయిలో వారు పైరవీలు మొదలెట్టారు.
జిల్లాలో 9 మున్సిపాలిటీలు.. 4 కార్పొరేషన్లు..
మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో జవహర్ నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ కార్పొరేషన్లు కాగా, దమ్మాయిగూడ, నాగారం, మేడ్చల్, ఘట్ కేసర్, పోచారం, తూంకుంట, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా పరిధిలో మరో 52 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం కోఆప్షన్ సభ్యులను ఐదుకు పెంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఈ పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌లోకి వలసలు విపరీతంగా పెరిగాయి. దీంతో పార్టీ కోసం మొదట్నుంచీ పని చేస్తున్న వారికి టికెట్లు దక్కడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారందరినీ సంతృప్తి పరిచేందుకు ఆ పార్టీ అధినేత కోఆప్షన్ సభ్యులను ఐదుకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. జిల్లాలో కోఆప్షన్ పదవులను దక్కించుకునేందుకు ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు చెందిన నేతలు మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నేతల మల్లగుల్లాలు..
కోఆప్షన్ పదవులు నేతలకు కొత్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే.. మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రకరకాలుగా ఆశలు చూపి.. మున్సిపాలిటీలను చేజారకుండా చూసుకున్నారు. అప్పడు హామీలు తీసుకున్న నేతలంతా ఇప్పడు కోఆప్షన్ కోసం వస్తుండటంతో ఎవరికీ కేటాయించాలనే దానిపై ప్రజాప్రతినిధులు, కీలక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీ సైతం భారీగానే ఉంది. కోఆప్షన్ కోసం మున్సిపల్ పరిధిలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన ఇద్దరు మైనార్టీలు, ఇద్దరు ఇతర ప్రజాప్రతినిధులకు అవకాశం కలగనుంది. అయితే, కొత్త చట్టం విధివిధానాలు, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియపై నోటిఫికేషన్ వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలోటికెట్లు ఆశించిన వారిని బుజ్జగించే క్రమంలో కొందరికి పార్టీ కోఆప్షన్ పదవులను ఆశ చూపింది. ఉన్న పదవుల కంటే ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని ఆశావాహుల్లో గుబులు పట్టుకుంది.
Tags: co-option members, trs party,fight