చదువును మించిన సంపద లేదు..!

దిశ, కోదాడ: చదువును మించిన సంపద మరొకటి లేదని భావితరాలకు ఉపయోగపడే విధంగా రాజావారి కోట చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో దక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‎స్టిట్యూట్‎ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రాంగణాల్లోనే విజ్ఞాన కేంద్రం వెలువడడం శుభపరిణామమని అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కొన్ని లక్షల పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండటంతో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతోందని అన్నారు. చరిత్రను తెలుసుకుని కాపాడుకోవడానికి అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విజ్ఞాన కేంద్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement