- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టిమ్స్‌లో వెంటిలేటర్ల కొరత లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ,తెలంగాణ బ్యూరో: కరోనాను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్రాల నిధులను సద్వినియోగం చేసుకొని కొవిడ్‌ను ఎదుర్కోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గచ్చిబౌలిలోని టిమ్స్, సనత్నగర్ఈఎస్ఐ ఆసుపత్రులను సందర్శించారు. ఆక్సిజన్నిల్వలు, వెంటిలేటర్లు, బెడ్ల లభ్యత, పేషెంట్స్‌కు అందుతున్న సేవలను పరిశీలించారు. దేశంలో విపత్తుకర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కోనేందుకు అన్ని రాష్ట్రాల దగ్గర రాష్ట్ర విపత్తు నిర్వాహణ నిధి ఉంటుందన్నారు. ఈ ఫండ్స్‌తో ఆయా రాష్ట్రాల్లో అవసరమైన అవసరమైన కొత్త ఆసుపత్రులను ఓపెన్‌చేయడం, ఆక్సిజన్, వెంటిలేటర్స్ ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు.
గచ్చిబౌలి టీమ్స్‌లో ప్రస్తుతం వెంటిలేటర్ల కొరత లేదని, ఆసుపత్రిలో 200 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో 100 వెంటిలేటర్లను మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి మాదిరే టిమ్స్‌లోనూ ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను గాలి ద్వారా ఉత్పత్తి చేసేలా యుద్ధ ప్రతిపాదికన ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టిమ్స్ లో ప్రస్తుతం 600 మంది పేషెంట్స్చికిత్స పొందుతున్నారని, వీరిలో 100 మంది దాకా ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. మరో 400 మంది పేషెంట్స్ కు సాధారణ ఆక్సిజన్ ద్వారా ట్రిట్ మెంట్ అందుతోందన్నారు. 50 మంది మాత్రం సాధారణ చికిత్స పొందుతున్నారన్నారు. రోగులకు ఆక్సిజన్ పెట్టే సమయంలో ఉపయోగించే ఎన్ఆర్బీ మాస్కుల కొరత టీమ్స్‌లో ఉందన్నారు. ఎన్ఆర్బీ మాస్కుల కొరత విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర, వైద్యారోగ శాఖ మంత్రి ఈటెల రాజేందర్దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా టెస్టింగ్కిట్స్కొరత లేదని, ప్రజలెవ్వరికైనా కొవిడ్సోకినట్లు అనుమానం కల్గిన వెంటనే సంబంధిత ఆసుపత్రుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.