- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయవాదుల హత్య.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
దిశ, వెబ్ డెస్క్ : న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వామనరావు హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు తెలిపింది. సీబీఐకు ఇవ్వడం వల్ల సమయం వృథా అవుతుంది. అందుకే.. వారి హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని సీజే ధర్మాసనం పేర్కొంది. వామనరావు తండ్రికి ఉన్న బాధే.. కోర్టుకు ఉంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈరోజు కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 25 మంది నిందితులను విచారించినట్టు పోలీసులు.. కోర్టుకు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బిట్టు శీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో దరఖాస్తు చేశామని అన్నారు. నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. సీసీ టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపించినట్టు తెలిపారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.