- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా దానం చేసిన గంటకు ఇలా చేయొచ్చు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి రోజురోజుకూ విస్తృతమవుతోంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్లాస్మా థెరపీతో కరోనా నుంచి బయటపడొచ్చునని చెబుతోంది. కొవిడ్‌ను జయించిన వారి(వారియర్స్) నుంచి ప్లాస్మా సేకరించి వ్యాధిగ్రస్థులకు ఎక్కించడం వల్ల శరీరంలో యాంటీబాడీస్ సమృద్ధిగా ఏర్పడి కోలుకుంటారని పేర్కొంటోంది. అందుకే వారియర్స్ స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైద్యనిపుణులు పిలుపునిస్తున్నారు. ప్లాస్మా ఇచ్చిన వారిలో ఎలాంటి మార్పులు రావు. వారి రక్తం నుంచి ఎలాంటి రక్త కణాలు తీయరు. అందువల్ల బలహీనపడే అవకాశం లేదు. కేవలం ఒక గంట వ్యవధిలోనే ఆ వ్యక్తి తన పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కలిగే ప్రయోజనాలు, ఎలా చేస్తారు? ఎవరు అర్హులు.. తదితర అంశాలపై కిమ్స్ ఆస్పత్రుల రక్తనిధి కేంద్రం విభాగాధిపతి, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హితేష్ కుమార్ వివరించారు.
ప్లాస్మా థెరపీ ఎవరికి అవసరం
వ్యాధి తీవ్రత బాగా ఉండి విషమ పరిస్థితిలో ఉన్న కొవిడ్ పేషెంట్లకు ప్లాస్మా థెరపీ అవసరం. ఇప్పటికే కొవిడ్‌ను అధిగమించిన (వారియర్స్) వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. కరోనా పేషెంట్లకు ఐజీఎం సామర్థ్యం తక్కువగా ఉంటే ఈ ద్రవం ఎక్కించాలి. దీంతో పాటు, కొత్తగా శరీరంలో ఉత్పత్తి అయ్యే మరికొన్నియాంటీబాడీస్ ద్వారా రోగి వైరస్ నుంచి చాలా వేగంగా కోలుకుంటారు. ఎవరికి దీని అవసరం ఏర్పడుతుందో చికిత్స చేసే డాక్టర్లు నిర్ధారిస్తారు.
ఎవరు దానం చేయొచ్చు..?
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న కొవిడ్ పేషెంట్లు ప్లాస్మాదానం చేయవచ్చు. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా అర్హులే. పెళ్లి కాని యువతులు, గర్భం దాల్చని వివాహితల నుంచి తీసుకుంటారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నవారు, క్యాన్సర్ పేషెంట్లు, వరుసగా ఆరు నెలల నుంచి మందులు వాడుతున్నవారు, టీబీ పేషెంట్లు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు దీనికి అనర్హులు. దానం చేయడానికి వచ్చిన పేషెంట్‌కు ముందుగా హెచ్‌ఐవీ, కరోనా ఐజీ జీ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వారిలో ఐజీ జీ సామర్థ్యం ఎక్కువ ఉందా? లేదా? చూసిన తర్వాతే వారి నుంచి ప్లాస్మా తీయటం ప్రారంభిస్తారు. కచ్చితంగా సదరు వ్యక్తి గతంలో కొవిడ్ పేషెంట్ అవునో కాదో తెలుసుకోవటానికి వారి స్వాబ్ కలెక్షన్‌కు సంబంధించిన నివేదిక చాలు. బ్లడ్ బ్యాంకులో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి.
ఎన్నిసార్లు దానం చేయొచ్చు?
ఒక వ్యక్తి నెలలో రెండుసార్లు దానం చేయొచ్చు. ఒకసారి తీసిన దానిని మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య భద్రపరిచి ఏడాది వరకు నిల్వ చేయవచ్చు.
ఏ బ్లడ్ గ్రూపు?
దానం చేసే వ్యక్తికి, పేషెంట్‌కు ఒకే బ్లడ్ గ్రూపు అయినప్పుడు, ప్లాస్మా అనుకూలత చార్ట్ అనుసరించి మాత్రమే దీనిని ఎక్కిస్తారు.
ఎంత ప్లాస్మా తీస్తారు?
ఒకసారి 80 మిల్లీలీటర్ల ప్లాస్మా వస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఐదు సార్లు అంటే 400 మిల్లీ లీటర్లు తీసుకుంటారు. సాధారణంగా ఒక పేషెంట్‌కు 200 మిల్లీ లీటర్లు సరిపోతుంది. దానికి అతని బాడీ స్పందించకపోతే గరిష్ఠంగా మూడు డోసుల వరకు ఎక్కిస్తారు.
ఎలా నమోదు చేసుకోవాలి?
పేషెంట్లకు మాత్రమే ఇక్కడ తీసే ప్లాస్మాను వినియోగిస్తాం. ఎవరైనా దానం చేయాలనుకుంటే, రాగానే వారికి నిర్దేశిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, ప్లాస్మాదానం తీసుకుంటారు. గంటలోపు పంపిస్తారు. సగటున ఒక డోనర్ మూడు గంటల సమయాన్ని వెచ్చించాలి.