నో చేంజెస్ అంటున్న చార్మి

by Shyam |
నో చేంజెస్ అంటున్న చార్మి
X

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ కాగా.. ముంబై షెడ్యూల్ ఆల్రెడీ పూర్తయింది. హైదరాబాద్‌లో మరో షెడ్యుల్ ప్లాన్ చేసేలోపే.. కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి.

కాగా, విదేశాల్లోనూ కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉండటంతో ఫారిన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని, ఇక్కడే షూట్ చేస్తారని వార్తలొచ్చాయి. అంతే కాదు విదేశీయులతో ఫైట్ సీక్వెన్స్ కూడా తీసేసి.. స్క్రిప్ట్ మార్చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ రూమర్స్‌పై క్లారిటీనిచ్చింది నిర్మాత చార్మి కౌర్. ‘ఇది చాలా పకడ్బందీ స్క్రిప్ట్ అని.. మార్పులు చేసే ఉద్దేశం లేదని’ స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వెయిట్ చేస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story