- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడు : జీయర్ స్వామి
X
దిశ, అల్వాల్ : ప్రతి జీవిలోను భగవంతుడున్నాడని శ్రీ త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి అన్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహంను పురస్కరించుకొని సోమవారం అల్వాల్‌లోని పలు ఆలయాలను సందర్శించారు. భక్తులకు ప్రవచనాలను బోధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారంతో శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ క్రతువుకు భక్తులు నుంచి ధన, వస్తు రూపాల్లో వచ్చే బహుమతులను స్వీకరించ వచ్చని జీయర్‌స్వామి చెప్పారు.
భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడని, అందువల్ల మనుషులు సమతా భావం కలిగి ఉండాలని కోరారు. దైవారాధనలో కుల, మతాల ప్రస్తావన ఉండకూడదని, భవగంతుని ముందు మనుషులందరూ సమానులేనని గుర్తుచేశారు. అనంతరం పాత అల్వాల్‌లోని పురాతన రామాలయం, బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
- Tags
- Alwal
- Jiyar Swami
Next Story