లాక్‌డౌన్ పొడిగించే ఆలోచనల్లేవ్: కేంద్రం

by Shamantha N |   ( Updated:2020-03-29 23:49:54.0  )
లాక్‌డౌన్ పొడిగించే ఆలోచనల్లేవ్: కేంద్రం
X

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ను పొడిగించే ఆలోచనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. 21 రోజుల లాక్‌డౌన్ ముగిశాక దాన్ని పొడిగిస్తారని కొన్ని మీడియా రిపోర్టులు, వదంతులు ప్రచారంలో ఉన్నాయని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్నారు. అయితే అవన్నీ నిరాధారమైనవని తెలిపారు. లాక్‌డౌన్ పొడిగించాలన్న ప్రణాళికలేవి లేవని సోమవారం ఉదయం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: Coronavirus, lockdown, extension, rumours, baseless


Next Story