- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనిషి మారాడంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్!
దిశ వెబ్ డెస్క్: చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అంటూ ఉత్తరాంధ్రలో ఓ సామెత ఉంది. ఈ రోజు వైజాగ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుతెస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వెలిగిపోతున్న రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చోటుచేసుకుంటున్నాయి.
సరిగ్గా మూడేళ్ల క్రితం 2017 జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌కు పత్ర్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్టణంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని భావించి పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పుడు ప్రతిపక్షనేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తన సన్నిహితులతో కలిసి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జగన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కనీసం విమానాశ్రయం కూడా దాటనివ్వలేదు. పోలీసుల్ని ప్రశ్నిస్తే… భద్రతా కారణాల దృష్ట్యా వారిని అడ్డుకుంటున్నట్టు వెల్లడించారు. దీంతో జగన్, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఎయిర్‌పోర్టులోని రన్‌వే పైనే బైఠాయించారు. అప్పటికీ శాంతించని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. ఈ తతంగం ముగిసేసరికి సాయంత్రమైంది.
అచ్చం అలాగే వైజాగ్‌లోని భూముల్ని వైఎస్సార్సీపీ కబ్జా చేస్తోంది. దానిపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు విశాఖ, విజయనగరంలో రెండు రోజుల యాత్ర పేరిట ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమరావతి రాజధాని అంటూ తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన బాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికితే.. వైఎస్సార్సీపీ శ్రేణులు అప్పటి టీడీపీ శ్రేణుల్లా నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బాబు కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు కాన్వాయ్‌తో రోడ్డెక్కడంతో గుడ్లు, చెప్పులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అప్పట్లో పోలీసులు వ్యవహరించినట్టే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్రలో పర్యటించబోమని వైఎస్సార్సీపీ కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు. బాబును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మళ్లీ వెనక్కి తిప్పి పంపిస్తారా ? లేక భద్రత నడుము ఆయన ముందుకు సాగుతారా ? అన్నది ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పరిస్థితులన్నీ బాబును వెనక్కి తిప్పి పంపేలా కనిపిస్తున్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.