- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై దోపిడి దొంగల హల్‌చల్.. ఫ్యామిలీకి కత్తిపోట్లు!
దిశ, వెబ్‌డెస్క్ : దారి దోపిడి దొంగలు బరితెగించారు. మహరాష్ట్రలోని శిరిడి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తున్న కుటుంబంపై దోపిడి దొంగలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. తొలుత కారును అడ్డగించిన దొంగలు మారణాయుదాలతో విరుచుకపడ్డారు. బాధితుల నుంచి 8తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారును వేగంగా డ్రైవ్ చేయడంతో అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.
ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండవేలికిచర్ల గ్రామానికి చెందిన రాములు కుటుంబంగా గుర్తించారు. దుండగులు కత్తులతో దాడి చేయగా మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రాములు కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం గుర్తుపట్టని విధంగా తయారైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.