- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైన్‌షాపులో చోరీకి విఫలయత్నం
by Sumithra |

X
దిశ, జగిత్యాల: కరోనా కష్టకాలంలోనూ దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో శ్రీనివాస వైన్స్‌లో రెండ్రోజుల కిందట దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు.
మద్యం షాపులో ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుకాణా షెట్టర్లను గడ్డపారతో పగులగొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అర్థరాత్రి 1:30 ప్రాంతం లో దొంగతనం జరిగినట్లుగా తేలింది.
సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయిన దృశ్యాలు చూసి అవాక్కయిన వైన్స్ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story