- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి, చెల్లిని చంపిన యువకుడు
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు కుటుంబాన్ని బలిగొంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోకి రావల్‌కోల్ గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి భార్య సునీత(42), కుమారుడు సాయినాథ్‌రెడ్డి, కుమార్తె అనూషలు కలిసి జీవిస్తున్నారు. సునీత ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, సాయినాథ్‌రెడ్డి ఎంటెక్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది. ప్రభాకర్‌రెడ్డి మృతిచెందిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, భూమి అమ్మకం సొమ్ము కలిపి సుమారు రూ.20 లక్షలు బ్యాంకులో దాచారు. అయితే ఇటీవల సాయినాథ్‌రెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నష్టపోయాడు.
తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు తీసి, ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి, వాటిని అమ్మి బెట్టింగ్‌లకు పాల్పడే ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కుమారుడిని మందలించింది. ఈ క్రమంలో డబ్బులు కావాలని తల్లిని వేధించసాగాడు. అందుకు తల్లి నిరాకరించింది. దీంతో తల్లిని, చెల్లిని చంపడానికి కుట్ర పన్నాడు. ఈ నెల 23న ఇంట్లో రాత్రి భోజనంలో విషం కలిపి డ్యూటీకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో అన్న తిన్నం తల్లి,చెల్లి అపస్మారక స్థితికి వెళ్లారు. అనంతరం చేరుకున్న సాయినాథ్‌రెడ్డి వారిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న చెల్లెలు అనూష, 28న తల్లి సునీత మరణించారు. అనంతరం బంధువులు సాయినాథ్‌ను ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.