- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎక్స్ గ్రేషియా కోసం టవర్ ఎక్కి నిరసన
by Sridhar Babu |

X
దిశ, మానకొండూరు: తన తండ్రి తాటిచెట్టు పైనుంచి పడి మృతిచెంది సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంకా ఎక్స్ గ్రేషియా చెల్లించలేదని ఓ యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన బుర్ర శంకరయ్య 2019 జూన్ 25న తాడి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్థికసాయం అందించాలని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అయినా.. ఇంతవరకూ సాయం అందించలేదని మృతుని కమారుడు రాములు శుక్రవారం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని కిందకుదింపే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story