ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న చెత్త పోలీసులు: జగ్గారెడ్డి

by Shyam |
Congress MLA Jaggareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసలు హోంశాఖ ఉందా? అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనం చేసిందో లేదో తెలియకుండా పోలీసులు దళిత మహిళ మరియమ్మను కొట్టి చంపారని ఆరోపించారు. హోం మంత్రి అడ్రస్ లేడని, ఆయన చెబితే హోం గార్డు కూడా వినని పరిస్థితి ఏర్పడిందని, ఇంత దరిద్రపు పాలన ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసు దెబ్బలకు దళిత మహిళా చనిపోతే… కనీసం ఘటనా స్థలంకూ కూడా వెళ్లలేదని అన్నారు. కొందరు చెత్త పోలీసులు… ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరి కొందరు అధికారులు పదవుల కోసం ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు మరియమ్మ లాంటి ఘటనలు అధికార పార్టీ నాయకులకు గిఫ్ట్‌గా ఇస్తున్నారని ఆరోపించారు. రూ.2 లక్షల అభియోగం మీద ఇంత దుర్మార్గ చర్యనా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రి… సంఘటన స్థలానికి వెళ్తామని, అవసరమైతే రోడ్ల మీదికి కూడా వస్తామని స్పష్టం చేశారు. డీజీపీ… ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని సూచించారు.

సిద్దిపేట కలెక్టర్ సీఎం కాళ్లు మొక్కారు… కాళ్ల మీద పడి పదవులు సంపాదిస్తున్నారని, ఐఏఎస్… విలువ ఇచ్చే ఉద్యోగమన్నారు. కానీ కొంత మంది అధికారులు… చెప్రసి లాగా మారిపోయారని, ఇలాంటి అధికారుల నేను ఎప్పుడూ చూడలేదన్నారు. రూ.2లక్షల దోపిడీ ఆరోపణలపై చంపేస్తే దళిత సంఘాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. అధికార పార్టీలో నాయకులు… కాంట్రాక్టర్లు దోచుకుంటన్నారు… వారికి శిక్ష ఏది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story