- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలీ పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారిగా తిరిగొచ్చింది.. ఎక్కడంటే.!
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో మహిళా కూలీకి విలువైన వజ్రం లభించింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆ మహిళా కూలీ ఆదివారం టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో ఆ వజ్రం లభించింది. దాంతో ఆమె ఆ వజ్రాన్ని.. స్థానిక వ్యాపారికి విక్రయించినట్లు తెలుస్తోంది. రూ.6లక్షలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు వజ్రాన్వేషణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో తొలకరి జల్లులు పడ్డాయంటే చాలు ప్రజలంతా పొలాల బాట పడతారు.
ఉద్యోగస్తులు సైతం ఒక వారం రోజులపాటు సెలవులు పెట్టి మరీ పొలాల్లో తిష్టవేసి కూర్చుంటారు. జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, మద్దికెర ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో ఈ వజ్రాల దొరుకుతూ ఉంటాయి. అందువల్లే తొలకరి జల్లు పడ్డాయంటే చాలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. కుటుంబ సమేతంగా చాలామంది ఇక్కడి పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగిస్తారు. గత మే నెల 17న చిన్నజొన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 30 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ మరుసటిరోజే మరో మహిళకూ వజ్రం లభించింది. అయితే ఈ వజ్రాలను కేవలం రూ.40వేలు,రూ.70వేలకే విక్రయించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రాంతాల్లో వజ్రాలు ఎందుకు దొరుకుతాయని అడిగితే రాయలు ఏలిన కాలంలో వజ్రాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారని… అశోకుడి పాలనలో వజ్రాలను విస్తారంగా వెదజల్లారని..అందువల్లే అప్పుడప్పుడు వజ్రాలు లభిస్తాయని స్థానికులు చెబుతారు. అందుకే తొలకరి వర్షాలు పడగానే వందలాది మంది జనాలు ఇక్కడి పంట పొలాల్లో వజ్రాన్వేషణలో నిమగ్నమైపోతారు.