- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజు ఇంట్లో వస్తువులు మాయం.. అదే చేస్తుందని బోర్డు పెట్టిన మహిళ
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే అలా అమెరికాకు చెందిన ఓ మహిళ ఎంతో ప్రేమగా పిల్లిని పెంచుకుంటుంది. కానీ అది కాస్త తింగరి పిల్లి. అది చేసే పనులు చూస్తే పాపం ఆమెకు విసుగొచ్చింది. ఇంతకీ ఆ పిల్లి ఏం తింగరి పనులు చేస్తుంది అనేగా మీ ఆలోచన.. రోజు ఇంటిలో ఉండే చిన్న చిన్న వస్తువులు మాయవడం మొదలైంది. దీంతో ఆ మహిళ వస్తువులు ఎవరు కొట్టేస్తున్నారని చాలా ఆలోచించింది.
చివరికి తాను ఎంతగానో ఇష్టంగా పెంచుకుంటున్నే పిల్లినే వస్తువులను తీసుకెళ్లి పక్కింటిలో పారేస్తుందని తెలుసుకుంది. దీంతో ఏం చేయాల అని ఆలోచించి.. పిల్లిని కట్టడి చేయాలని విన్నూత్న ఆలోచన చేసింది. ఏంటీ ఆ ఆలోచన అనుకుంటున్నారా.. ఎక్కడైనా కుక్కలున్నాయి జాగ్రత్తా అని బోర్డ్ పెడుతారు. కానీ ఈ మహిళ మాత్రం నా పిల్లి దొంగ , జాగ్రత్తగా ఉండడి, ఒకవేళ నా పిల్లి నా వస్తువులను మీ ఇంటికి దొంగతనంగా తీసుకవస్తే తిరిగి నాకివ్వగలరు అని బోర్డ్ పెట్టింది. దీంతో ఆమె వస్తువులను వారు తిరిగి ఇవ్వడం మొదలు పెట్టారు. దీన్ని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.