వ్యభిచారంలో చిక్కిన మహిళా బాధితురాలే: మధ్యప్రదేశ్ హైకోర్టు

by  |
వ్యభిచారంలో చిక్కిన మహిళా బాధితురాలే: మధ్యప్రదేశ్ హైకోర్టు
X

భోపాల్: వ్యభిచార కూపంలోని మహిళ స్వయంగా బాధితురాలే, కాగా, ఆమెను ఐపీసీలోని సెక్షన్370 కింద నిందితురాలిగా పేర్కొనడం సరికాదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2017 జూన్‌లో ఓ హోటల్‌లో జరిగిన రెయిడ్‌లో వ్యభిచార రొంపిలోకి చిక్కుకున్న ఓ మహిళ అరెస్టయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఆమె పై 2018 డిసెంబర్‌లో అభియోగాలు దాఖలయ్యాయి. ఈ అభియోగాలను సవాలు చేస్తూ స్వయంగా తానే ఆ వ్యభిచార రొంపి బాధితురాలినని ఆమె హైకోర్టులో వాధించారు. ‘నిందితురాలు/పిటిషనర్ ఒక మహిళ. తనకు తానే దోపిడి చేసుకోవాలని ఎవ్వరూ భావించబోరు. కాబట్టి ఆమెనే సెక్షన్ 370 పరిధిలోకి తీసుకువచ్చి, ఆ సెక్షన్ చెబుతున్నట్టు ఆమెను బాధితురాలిగా పరిగణించాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఆమెపై సెక్షన్ 370 కింద అభియోగాలు మోపడం సరికాదేమో. ఆ సెక్షన్ కింద ఆమెకే రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఆమె స్వయంగా బాధితురాలే కదా’ అని తెలిపింది. అయితే, తుది నిర్ణయాన్ని ట్రయల్ కోర్టుకే వదిలిపెట్టింది.


Next Story