కొవాగ్జిన్: అత్యవసర వినియోగంపై త్వరలో నిర్ణయం

by Shamantha N |
కొవాగ్జిన్: అత్యవసర వినియోగంపై త్వరలో నిర్ణయం
X

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడంపై మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకోనుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వహించిన ఓ వెబినార్‌లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడానికి డబ్ల్యూహెచ్‌వోకు ప్రత్యేక ప్రక్రియ ఉంటుందని, టీకా మూడు దశల వివరాలను కంపెనీలు ముందుగా సమర్పించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. వాటిని నిపుణుల సూచనల బృందం పరీక్షిస్తుంది. తర్వాత వాటిని జాబితాలో చేరుస్తారు. టీకా సేఫ్టీ, ఎఫికసీలతోపాటు తయారీ నాణ్యత, ప్రమాణాల వివరాలను తొలుత సంస్థకు సమర్పించాల్సి ఉంటుందని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. భారత్ బయోటెక్ ఆల్రెడీ డేటా సమర్పించిందని, అత్యవసర వినియోగ జాబితాలో కొవాగ్జిన్ టీకా చేర్పుపై మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో నిర్ణయం వస్తుందని చెప్పారు.

Advertisement

Next Story