- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ థియేటర్ లో సినిమా చూసి వచ్చిన వారికి షాక్.. పార్కింగ్ చేసిన బైకులు అలా

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దిల్సుఖ్నగర్ శివగంగా థియేటర్ ప్రహారి గోడ కూలింది. గోడ కూలిన సమయంలో థియేటర్ లో ఫస్ట్ షో సినిమా నడుస్తోంది. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు తమ ద్విచక్ర వాహనాలను గోడను అనుసరించి పార్కింగ్ చేశారు. అయితే వర్షం కారణంగా కాంపౌండ్ వాల్ బైక్ లపై కూలింది. ఈ ప్రమాదంలో సుమారు 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చిన వాహనదారులు ధ్వంసమైన తమ బైకులను చూసి యాజమాన్యంతో గొడవకు దిగారు. యాజమాన్యమే రిపేర్ చేయించి ఇవ్వాలని, లేదా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Next Story