లంచం తీసుకున్న వాలంటీర్‌కి ఝలక్  

by srinivas |   ( Updated:2020-08-21 10:50:04.0  )
లంచం తీసుకున్న వాలంటీర్‌కి ఝలక్  
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖలో పనులన్నీ పూర్తి పారదర్శకంగా జరుగుతాయని కమిషనర్‌ జీఎస్ నవీన్‌ కుమార్‌ తెలిపారు. ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెద్ద భీంపల్లికి చెందిన గ్రామ వాలంటీర్‌ వైఎస్ఆర్‌ చేయూత పథకం లబ్దిదారుల నుంచి లంచం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ఆ వాలంటీర్‌ ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎంతో ఉన్నత ఆశయంతో రూపొందిన సచివాలయాల వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదన్నారు. లబ్దిదారులు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని, ఒకవేళ ఎవరైనా అలా అడిగితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed