- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమిషనర్ కాళ్లు మొక్కి మరీ వేడుకున్నడు.. ఎందుకో తెలుసా?
by Shyam |
X
దిశ, షాద్‌నగర్: తమ ఊరి సమీపంలోని డంపింగ్ యార్డులో చెత్త వేయొద్దంటూ సోలిపూర్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. తమ ప్రాణాలంటే లెక్కలేదా అంటూ నిలదీశారు. రోగాల బారిన పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తగిన నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పూను కుంటామని హెచ్చరించారు. సింగపాగ జంగయ్య మాదిగ తమ గ్రామానికి చెత్త తేవద్దంటూ మున్సిపల్ కమిషనర్ లావణ్య కాళ్లు మొక్కి మరీ వేడుకున్నాడు. ఈ ధర్నాలో, పులిమామిడి, వెంకటేష్ గౌడ్, రాజేష్ గౌడ్, చీపిరి వెంకటేష్ యాదవ్, రమేశ్ యాదవ్, సింగపాగ అనిల్ కుమార్, వెంకటేశ్, అంజి, సోమ్లా నాయక్, గోపాల్ నాయక్, మారుతి, రాములు, ఆంజనేయులు, మచ్చ సుధాకర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story