ప్రకృతి నేస్తం నెమలి

by  |
ప్రకృతి నేస్తం నెమలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: వర్షం వచ్చేముందు ఎలాంటి శబ్దాలను చేయకుండా పురివిప్పి మనకు తెలియజేస్తుంది నెమలి అంటూ ఆ జాతీయ పక్షి గురించి ప్రధాని మోడీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేసిన ఫోటోలు, వీడియో వైరల్‌గా మారాయి. నెమలి ఈకలతో మన పురాణ ఇతిహాసాల్లో ఒకవైపు కృష్ణుడికి మరోవైపు శివుడికి ఉన్న సంబంధాన్ని మోడీ స్వయంగా రాసిన తన కవితలో ప్రస్తావించారు. వివిధ సందర్భాల్లో నెమలితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే కొన్ని వీడియోలను, ఫోటోలను మోడీ విడుదల చేశారు. ఉదయం పూట తాను వాకింగ్ చేస్తున్న సమయంలో నెమళ్ళు తన పక్కనే ఎలా తిరుగుతూ ఉంటాయో, పురివిప్పి కనిపిస్తూ ఉంటాయో వీడియోల ద్వారా వివరించారు.

ప్రధాని తన నివాసంలో నెమలికి ఆహారాన్ని తినిపిస్తూ ఉన్న వీడియోను, ఫోటోను షేర్ చేశారు. ప్రతీరోజూ వాకింగ్ సమయంలో కనిపించే ఈ నెమళ్ళు బెదిరిపోకుండా అక్కడే తిరుగుతుండడానికి అలవాటు పడిపోయాయి. ప్రధాని చేతిలో ప్లేట్‌లో ధాన్యపు గింజలను పట్టుకుంటే వాటంతట అవే వచ్చి తినేంతగా అలవాటుపడ్డాయి. ప్రధానికి ప్రకృతి అన్నా, వన్యప్రాణులు అన్నా, వాటితో కలిసిపోయి ఉండే పర్యావరణమన్నా ఎంత ఇష్టమో అనే కామెంట్లు వచ్చాయి.


Next Story

Most Viewed