- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు.. కాపాడండి
దిశ, రామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన గంగుల టప్ప రాములు, గంగుల టప్ప నరసయ్య, గంగుల టప్ప రాజవ్వ, గంగుల టప్ప లక్ష్మిలకు సర్వే నెంబర్ 93లో తాతముత్తాల నుంచి వచ్చిన 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అయితే, ఇటీవల ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన ఎర్రోల్ల నరేష్ కన్ను పడింది. దీంతో నరేష్ అతని స్నేహితులతో కలిసి ఆ భూమి మాది అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని గంగుల టప్ప రాములు వాపోయారు. గత 60 ఏండ్ల నుంచి ఈ భూమిలో మేము పంట పండిస్తున్నామని తెలిపారు. గత రెండ్రోజుల క్రితం ఎర్రోళ్ల నరేష్ అతని ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చి చంపుతామంటూ బెదిరింపులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపారు.
ఇప్పటికే ఈ విషయమై మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో, ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు చేశామని తెలిపారు. అంతేగాకుండా.. జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకీ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నరేష్ నుంచి, ఆయన మిత్రుల నుంచి మాకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.