వారి సమాచారమిస్తే రూ.36 కోట్ల బహుమానం

by Anukaran |   ( Updated:2020-11-28 10:07:03.0  )
వారి సమాచారమిస్తే రూ.36 కోట్ల బహుమానం
X

వాషింగ్టన్: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడుల(26/11)కు సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా సభ్యుడు సాజిద్ మిర్‌ అరెస్టుకు దోహదపడే సమాచారమందించిన వారికి అమెరికా ప్రభుత్వం రూ.36 కోట్ల (సుమారు ఐదు మిలియన్ డాలర్లు) రివార్డు ప్రకటించింది. 2008 నవంబర్‌లో జరిగిన ముంబయి దాడుల మాస్టర్ మైండ్ సాజిద్ మిర్ తమ వాంటెడ్ లిస్టులో ఉన్నాడని, సాజిద్ అరెస్టుకు ఉపకరించే వివరాలందించినవారికి బహుమానం అందించనున్నట్టు అమెరికాకు చెందిన రివార్డ్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఇలినాయిస్ ఉత్తర జిల్లా కోర్టులో మిర్‌పై నేరారోపణలున్నాయని, అమెరికా వెలుపల ఆ దేశ పౌరుడిని హతమార్చే అభియోగాలున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 12 ఏళ్ల తర్వాత సాజిద్ మిర్ వివరాలిస్తే రివార్డు అందించనున్నట్టు ప్రకటించింది.

Advertisement

Next Story