ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది.. థర్డ్ వేవ్‌ వచ్చే ప్రమాదముంది : కేంద్ర ఆరోగ్యశాఖ

by Shyam |
Union Ministry of Health
X

దిశ, తెలంగాణ బ్యూరో: పండుగలు, ఫంక్షన్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. శనివారం వివిధ రాష్ర్టాల ఆరోగ్యశాఖలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. కేసులు తగ్గాయని, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగినట్టు స్పష్టం చేసింది. అత్యధిక మంది కరోనా నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నది. ఇది థర్డ్ వేవ్ రూపంలో ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ముందస్తు జాగ్రత్తగా ఆక్సిజన్, మందులను సమకూర్చుకోవాలని వివరించింది. ఈ మీటింగ్‌కు బీఆర్‌కే భవన్ నుంచి హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed