- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాలకు సాధ్యమైనంత సాయం చేస్తాం: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధం చేసేందుకు రాష్ట్రాలకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. రెమిడీసీవర్ ఉత్పత్తిని రెండింతలు చేయడం, నిరంతరంగా కొవిడ్ వ్యాక్సిన్స్ సరఫరా, హెల్త్ కేర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలకు తగిన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తు ఆయన ట్వీట్ చేశారు. ‘ వ్యాక్సిన్ సరఫరాను చిన్న రాష్ట్రాల్లో 7 రోజులకోసారి, పెద్ద రాష్ట్రాల్లో 4 రోజులకు ఒకసారి పునరుద్దరిస్తాం. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా కోవాగ్జిన్ ఉత్పత్తిని పది రెట్లు పెంచుతాం’ అని ట్వీట్‌లో తెలిపారు. కొవిడ్ పేషెంట్ల కోసం తగిన సంఖ్యలో బెడ్‌లను అందించేందుకు గాను తాత్కాలిక ఆస్పత్రులను, డెడికేటేడ్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పలు రాష్ట్రాలకు అడిషనల్ వెంటిలేటర్ల సదుపాయాలను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరాపై ఆయన మాట్లాడుతూ… ‘ఆక్సిజన్ ఉత్పత్తిని గరిష్టంగా పెంచుతున్నాం. దీని కోసం పరిశ్రమల కోసం వినియోగిస్తున్న ఆక్సిజన్‌ను వైద్య అవసరాల కోసం మళ్లించాం. దేశ వ్యాప్తంగా 162 పీఎస్ఏ ప్లాంట్‌లను వేగంగా ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు.