- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం డైలమా..!
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం డైలమాలో పడింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పినా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ విధివిధాలు ప్రకటించ లేదు. దీంతో ఎలాంటి ఏర్పాట్లను చేపట్టాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలను తీసుకోలేక పోతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్ అందిచాలని కేంద్రానికి లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి సూచనలు ప్రభుత్వానికి రాలేదు. రాష్ట్రానికి 3.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరముండగా ఇప్పటి వరకు 80 లక్షల వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 9 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ అందిస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందిస్తామని, 25శాతం వ్యాక్సిన్ డోసులను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయిస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో ఆధా కావడంతో పాటు వ్యాక్సిన్ కొరత కష్టాలు తీరిపోయినట్టేని ప్రభుత్వం భావించింది. అయితే ఉచిత వ్యాక్సిన్లను ఏ ప్రతిపాదికపై అందిస్తారు, ఏ విధమైన ఏర్పాట్లు చేపట్టాలనే అంశాలపై కేంద్రం స్పష్టతను ఇవ్వకపోవడంతో ప్రభుత్వం డైలమాలో పడింది.
కేంద్రం నుంచి వెలువడని విధివిధానాలు
ఈ నెల 21 నుంచి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఎలాంటి గైడ్ లైన్స్‌ను ఇవ్వలేదు. ఏ ప్రాతిపాధికన వ్యాక్సిన్ పంపిణీ చేస్తారు. లబ్ధిదారులను ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశాలపై క్లారిటీ లేకపోవడంతో ప్రకటించిన తేది నాటికి వ్యాక్సినేషన్ నిర్వాహణ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పాజిటివ్ కేసుల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేసి అవకాశం ఉందనే చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి వ్యాక్సిన్ డోసులు చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ విధివాధాలను తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినప్పట్టికీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానాలు అందలేదు.
రాష్ట్రానికి 3.6కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి 3.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం దాదాపుగా 80 లక్షల వరకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేపట్టారు. వీరిలో మొదటి డోసు వ్యాక్సిన్‌ను 64,69,106, రెండవ డోసుల వ్యాక్సిన్‌ను 15,10,530 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇంకా 2.8కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. కేంద్ర నుంచి సరిపడా వ్యాక్సిన్ పంపిణీ లేకపోవడంతో వ్యాక్సిన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. 20 రోజులగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16లక్షల మంది సూపర్ స్ర్పెడర్స్‌కు వ్యాక్సిన్‌ను అందిచారు.
సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు
కేంద్ర నుంచి సరిపడా వ్యాక్సిన్లు సరఫరా లేకపోవడం వలనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాష్ట్రానికి కావల్సిన 2.8కోట్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తే వారం రోజుల్లోపు లబ్దిదారులందరికీ వ్యాక్సిన్ అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. జూన్ నెలలో కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని టార్గెట్ విధించుకున్నాం. ఇందుకు కేంద్ర సహకరిస్తే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము.