కూలీల ట్రాక్టర్‌ ‌బోల్తా.. 17 మందికి గాయాలు

by Shyam |
కూలీల ట్రాక్టర్‌ ‌బోల్తా.. 17 మందికి గాయాలు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని సీతారాంపురంలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 17 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… హుజూర్‌‌ నగర్‌‌పట్టణంలోని సీతారాంనగర్‌‌‌కు చెందిన వ్యవసాయ కూలీలు చిలుకూరు మండలంలోని సీతారాంపురం గోదాముల ఎదురుగా నరేష్‌ ‌అనే రైతు పొలంలో నాటు వేసేందుకు వచ్చారు. పని ముగించుకొని ట్రాక్టర్‌‌‌లో తిరిగి వెళ్తుండగా మట్టిరోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌‌ డ్రైవర్‌‌తో సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు. అనంతరం కేసు నమోదు చేయనున్నట్లు చిలుకూరు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story