ఎట్టి పరిస్థితుల్లో ఆ వాహనాలు బోర్డర్‌ దాటొద్దు

by vinod kumar |
Nagar Kurnool SP Sai Shekhar
X

దిశ, అచ్చంపేట: కరోనా తెచ్చిన తంటాతో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో వివాద పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ మూడోరోజూ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయిన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని దోమలపెంట చెక్‌పోస్టు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సాయి శేఖర్ రాష్ట్ర సరిహద్దు బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

ఆంధ్రా వైపు నుండి శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు అనుమతులు ఇవ్వొద్దని, మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన కోవిడ్ బాధితులు చికిత్స నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వారికి హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్‌లు కన్ఫామ్ అయినట్టు ఆధారాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలని ఈగలపెంట ఎస్సై పోచెయ్యకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు లేని వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలోకి రానివ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed